Logo

యోబు అధ్యాయము 5 వచనము 21

కీర్తనలు 31:20 మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు

కీర్తనలు 55:21 వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.

కీర్తనలు 57:4 నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులువారి నాలుక వాడిగల కత్తి.

సామెతలు 12:18 కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.

యెషయా 54:17 నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 18:18 అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండ మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి.

యాకోబు 3:5 ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

యాకోబు 3:6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.

యాకోబు 3:7 మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతిచేత సాధు కాజాలును, సాధు ఆయెను గాని

యాకోబు 3:8 యే నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

కీర్తనలు 91:5 రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను

కీర్తనలు 91:6 చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.

కీర్తనలు 91:7 నీ ప్రక్కను వేయిమంది పడినను నీ కుడిప్రక్కను పదివేలమంది కూలినను అపాయము నీయొద్దకు రాదు.

కీర్తనలు 12:5 బాధపడువారికి చేయబడిన బలాత్కారమునుబట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

సామెతలు 3:25 ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు

సామెతలు 14:3 మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.