Logo

యోబు అధ్యాయము 12 వచనము 7

యోబు 21:29 దేశమున సంచరించువారిని మీరడుగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్టలేదా?

యోబు 21:30 అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు ఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.

సామెతలు 6:6 సోమరీ, చీమల యొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

యెషయా 1:3 ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

యిర్మియా 8:7 ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తి పిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.

యోబు 8:10 వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదా వారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.

యోబు 18:3 మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఏల?

సామెతలు 30:24 భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి.