Logo

యోబు అధ్యాయము 16 వచనము 22

యోబు 14:5 నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలసంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించియున్నావు

యోబు 14:14 మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును

యోబు 7:9 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు

యోబు 7:10 అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.

యోబు 14:10 అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు?

ప్రసంగి 12:5 ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసరకాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు.

1రాజులు 2:2 లోకులందరు పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను; కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము గలిగి

యోబు 4:20 ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురు ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.

యోబు 7:6 నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.