Logo

యోబు అధ్యాయము 19 వచనము 29

యోబు 13:7 దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?

యోబు 13:8 ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా?

యోబు 13:9 ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా?

యోబు 13:10 మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.

యోబు 13:11 ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా?

రోమీయులకు 13:1 ప్రతివాడును పై అధికారులకు లోబడి యుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడియున్నవి.

రోమీయులకు 13:2 కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.

రోమీయులకు 13:3 ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచికార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండకోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు.

రోమీయులకు 13:4 నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.

కీర్తనలు 58:10 ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు.

కీర్తనలు 58:11 కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.

ప్రసంగి 11:9 యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము;

మత్తయి 7:1 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.

మత్తయి 7:2 మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును.

యాకోబు 4:11 సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించు వాడవైతివి.

యాకోబు 4:12 ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడైయున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

యోబు 20:3 నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.