Logo

యోబు అధ్యాయము 20 వచనము 7

1రాజులు 14:10 కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులుగాని ఘనులుగాని లేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలము చేసి, పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.

2రాజులు 9:37 యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలెనుండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున యిది జరిగెను.

కీర్తనలు 83:10 వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.

యిర్మియా 8:2 వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంటవలె పడియుండును.

యోబు 14:10 అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు?

యోబు 4:20 ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురు ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.

యోబు 20:9 వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు

యోబు 21:28 అధిపతుల మందిరము ఎక్కడ నున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.

యోబు 27:19 వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు.

కీర్తనలు 41:5 అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.

కీర్తనలు 52:5 కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును.(సెలా.)

యెషయా 41:12 నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

ఓబధ్యా 1:4 పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రిందపడవేతును; ఇదే యెహోవా వాక్కు.

మలాకీ 2:3 మిమ్మునుబట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖములమీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు

ఫిలిప్పీయులకు 3:8 నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.