Logo

యోబు అధ్యాయము 21 వచనము 34

యోబు 16:2 ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.

యోబు 13:4 మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు.

యోబు 32:3 మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.

యోబు 42:7 యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదను మండుచున్నది

యోబు 6:25 యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?

యోబు 36:4 నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు.

దానియేలు 5:10 రాజునకును అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము.

జెకర్యా 10:2 గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొఱ్ఱలమంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనొందిరి.