Logo

యోబు అధ్యాయము 22 వచనము 22

ద్వితియోపదేశాకాండము 4:1 కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి.

ద్వితియోపదేశాకాండము 4:2 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు.

సామెతలు 2:1 నా కుమారుడా, నీవు నా మాటలనంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల

సామెతలు 2:2 జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల

సామెతలు 2:3 తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవిచేసినయెడల

సామెతలు 2:4 వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల

సామెతలు 2:5 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును.

సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

సామెతలు 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.

సామెతలు 2:8 న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.

సామెతలు 2:9 అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.

1దెస్సలోనీకయులకు 4:1 మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.

1దెస్సలోనీకయులకు 4:2 కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.

యోబు 23:12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.

ద్వితియోపదేశాకాండము 6:6 నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.

ద్వితియోపదేశాకాండము 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీచేతికి కట్టుకొనవలెను.

ద్వితియోపదేశాకాండము 6:8 అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.

ద్వితియోపదేశాకాండము 6:9 నీ యింటి ద్వారబంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.

కీర్తనలు 119:11 నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను.

సామెతలు 4:4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.

సామెతలు 4:21 నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసికొనుము.

యిర్మియా 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.

మత్తయి 12:35 సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.

మత్తయి 13:52 ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను.

లూకా 2:19 అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.

లూకా 2:51 అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను.

యోబు 11:13 నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల నీచేతులు ఆయనవైపు చాపినయెడల

యోబు 35:13 నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.

సామెతలు 1:3 నీతి న్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును

సామెతలు 4:10 నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.

సామెతలు 7:1 నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీయొద్ద దాచిపెట్టుకొనుము.

యెషయా 48:17 నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.

యిర్మియా 9:20 స్త్రీలారా, యెహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.

యెహెజ్కేలు 3:10 మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పుమాటలన్నిటిని చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని