Logo

యోబు అధ్యాయము 26 వచనము 7

యోబు 9:8 ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడు సముద్ర తరంగములమీద ఆయన నడుచుచున్నాడు.

ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

ఆదికాండము 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

కీర్తనలు 24:2 ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను.

కీర్తనలు 104:2 వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచియున్నావు.

కీర్తనలు 104:3 జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు

కీర్తనలు 104:4 వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను2 తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు.

కీర్తనలు 104:5 భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.

సామెతలు 8:23 అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.

సామెతలు 8:24 ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.

సామెతలు 8:25 పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు

సామెతలు 8:26 భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేలమట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.

సామెతలు 8:27 ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.

యెషయా 40:22 ఆయన భూమండలముమీద ఆసీనుడైయున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.

యెషయా 40:26 మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయముచేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.

యెషయా 42:5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

ఆదికాండము 1:6 మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను.

ఆదికాండము 1:9 దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

యోబు 38:6 దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.

కీర్తనలు 78:69 తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను

కీర్తనలు 89:12 ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి.

కీర్తనలు 104:5 భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.

కీర్తనలు 136:6 ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును.

యెషయా 44:24 గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను

యిర్మియా 10:12 ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.

జెకర్యా 12:1 దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా