Logo

యోబు అధ్యాయము 35 వచనము 3

యోబు 9:21 నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే.

యోబు 9:22 కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.

యోబు 10:15 నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

యోబు 21:15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు

యోబు 31:2 ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును?ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?

యోబు 34:9 నరులు దేవునితో సహవాసము చేయుట వారికేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు.

కీర్తనలు 73:13 నా హృదయమును నేను శుద్ధిచేసికొనియుండుట వ్యర్థమే నాచేతులు కడుగుకొని నిర్మలుడనైయుండుట వ్యర్థమే

మలాకీ 3:14 దేవునిసేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,

యోబు 15:6 నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.

యోబు 32:17 నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను.

యోబు 34:37 అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.

యోబు 36:21 జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరుకొనియున్నావు.

యోబు 40:8 నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పుపొందుటకై నామీద అపరాధము మోపుదువా?

1కొరిందీయులకు 15:32 మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.