Logo

యోబు అధ్యాయము 36 వచనము 17

యోబు 16:5 అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును

యోబు 34:8 అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.

యోబు 34:36 దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను.

రోమీయులకు 1:32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.

ప్రకటన 18:4 మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండు నట్లును దానిని విడిచి రండి.

యోబు 9:19 బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా ప్రతివాదిగానుండ తెగించువాడెవడని ఆయన యనును?

యోబు 10:3 దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

మలాకీ 2:17 మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోషపడును;లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పుకొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.

లూకా 12:58 వాదించువానితో కూడ అధికారి యొద్దకు నీవు వెళ్లుచుండగా అతని చేతినుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము, లేదా, అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొనిపోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును.