Logo

ఆదికాండము అధ్యాయము 10 వచనము 1

ఆదికాండము 2:4 దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.

ఆదికాండము 5:1 ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;

ఆదికాండము 6:9 నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.

మత్తయి 1:1 అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి.

ఆదికాండము 9:1 మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధిపొంది భూమిని నింపుడి.

ఆదికాండము 9:7 మీరు ఫలించి అభివృద్ధినొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.

ఆదికాండము 9:19 ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.

ఆదికాండము 5:32 నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.

ఆదికాండము 7:13 ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.

ఆదికాండము 9:18 ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.

ఆదికాండము 10:32 వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమిమీద వ్యాపించెను.

ఆదికాండము 37:2 యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారులయొద్దను జిల్పా కుమారులయొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమునుగూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండువాడు.

సంఖ్యాకాండము 3:1 యెహోవా సీనాయి కొండమీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.

1దినవృత్తాంతములు 1:5 యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

2దినవృత్తాంతములు 14:13 ఆసాయును అతనితో కూడనున్న వారును గెరారువరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి.