Logo

ఆదికాండము అధ్యాయము 10 వచనము 6

ఆదికాండము 9:22 అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.

1దినవృత్తాంతములు 1:8 హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.

1దినవృత్తాంతములు 1:9 కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.

1దినవృత్తాంతములు 1:10 కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరాక్రమశాలులలో మొదటివాడు.

1దినవృత్తాంతములు 1:11 లూదీయులు అనామీయులు లెహాబీయులు నప్తుహీయులు

1దినవృత్తాంతములు 1:12 పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.

1దినవృత్తాంతములు 1:13 కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.

1దినవృత్తాంతములు 1:14 యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు

1దినవృత్తాంతములు 1:15 హివ్వీయులు అర్కీయులు సీనీయులు

1దినవృత్తాంతములు 1:16 అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.

1దినవృత్తాంతములు 4:40 మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వమందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపురముండిరి.

కీర్తనలు 78:51 ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను.

కీర్తనలు 105:23 ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను.

కీర్తనలు 105:27 వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి

కీర్తనలు 106:22 ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.

యెషయా 11:11 ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును

యిర్మియా 46:9 గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.

యెహెజ్కేలు 27:10 పారసీక దేశపువారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.

ఆదికాండము 2:13 రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.

ఆదికాండము 7:13 ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.

ఆదికాండము 9:18 ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.

ఆదికాండము 10:20 వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములనుబట్టియు జాతులనుబట్టియు హాము కుమారులు.

యెహోషువ 13:3 కనానీయులవని యెంచబడిన ఉత్తరదిక్కున ఎక్రోనీ యుల సరిహద్దువరకును ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయులయొక్కయు అష్డోదీయుల యొక్కయు అష్కెలోనీయులయొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయులయొక్కయు దేశమును

2దినవృత్తాంతములు 12:3 అతనితో కూడ ఐగుప్తునుండి వచ్చిన లూబీయులు సుక్కీయులు కూషీయులు అనువారు లెక్కకు మించియుండిరి.

యెహెజ్కేలు 38:5 నీతో కూడిన పారసీకదేశపువారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిరస్త్రాణములను ధరించువారినందరిని నేను బయలుదేరదీసెదను.

నహూము 3:9 కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తారజనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులైయుండిరి.

హబక్కూకు 3:7 కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణకెను.