Logo

ఆదికాండము అధ్యాయము 10 వచనము 29

1రాజులు 9:28 వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.

1రాజులు 22:48 యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలైపోయెను.

1దినవృత్తాంతములు 8:18 ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.

1దినవృత్తాంతములు 9:10 యాజకులలో యెదాయా యెహోయారీబు యాకీను,

1దినవృత్తాంతములు 9:13 మరియు తమ పితరుల యిండ్లకు పెద్దలైన వెయ్యిన్ని యేడువందల అరువదిమంది కుటుంబికులు. వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు.

యోబు 22:24 మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము

యోబు 28:16 అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.

కీర్తనలు 45:9 నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.

యెషయా 13:12 బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండజేసెదను.

ఆదికాండము 2:11 మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.

ఆదికాండము 25:18 వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి యెదుట నివాసమేర్పరచుకొనెను.

1సమూయేలు 15:7 తరువాత సౌలు అమాలేకీయులను హవీలానుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి

1దినవృత్తాంతములు 1:23 ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.

1దినవృత్తాంతములు 1:45 యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపువాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.