Logo

ఆదికాండము అధ్యాయము 10 వచనము 25

ఆదికాండము 10:21 మరియు ఏబెరు యొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.

1దినవృత్తాంతములు 1:19 ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.

ఆదికాండము 11:16 ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.

ఆదికాండము 11:17 ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:18 పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.

ఆదికాండము 11:19 పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

లూకా 3:35 నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,

లూకా 3:36 షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,

ఆదికాండము 10:32 వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమిమీద వ్యాపించెను.

ద్వితియోపదేశాకాండము 32:8 మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.

అపోస్తలులకార్యములు 17:26 మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని,

ఆదికాండము 10:5 వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.

ఆదికాండము 11:8 ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.

ఆదికాండము 11:9 దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.

యోబు 15:19 అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.