Logo

ఆదికాండము అధ్యాయము 46 వచనము 8

ఆదికాండము 29:1 యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.

ఆదికాండము 30:43 ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.

ఆదికాండము 35:23 యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.

ఆదికాండము 49:1 యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.

ఆదికాండము 49:2 యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.

ఆదికాండము 49:3 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.

ఆదికాండము 49:4 నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.

ఆదికాండము 49:5 షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.

ఆదికాండము 49:6 నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.

ఆదికాండము 49:7 వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.

ఆదికాండము 49:8 యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.

ఆదికాండము 49:9 యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?

ఆదికాండము 49:10 షిలోహు వచ్చువరకు యూదాయొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.

ఆదికాండము 49:11 ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.

ఆదికాండము 49:12 అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.

ఆదికాండము 49:13 జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.

ఆదికాండము 49:14 ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.

ఆదికాండము 49:15 అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును.

ఆదికాండము 49:16 దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.

ఆదికాండము 49:17 దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.

ఆదికాండము 49:18 యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను.

ఆదికాండము 49:19 బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.

ఆదికాండము 49:20 ఆషేరు నొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.

ఆదికాండము 49:21 నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును.

ఆదికాండము 49:22 యోసేపు ఫలించెడి కొమ్మ ఊటయొద్ద ఫలించెడి కొమ్మదాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.

ఆదికాండము 49:23 విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.

ఆదికాండము 49:24 యాకోబు కొలుచు పరాక్రమశాలియైన వాని హస్తబలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను

ఆదికాండము 49:25 క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును

ఆదికాండము 49:26 నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును.

ఆదికాండము 49:27 బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.

ఆదికాండము 49:28 ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను.

ఆదికాండము 49:29 తరువాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను.

ఆదికాండము 49:30 హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రులయొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశానభూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను.

ఆదికాండము 49:31 అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతిపెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.

ఆదికాండము 49:32 ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారులయొద్ద కొనబడినదనెను.

ఆదికాండము 49:33 యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను.

నిర్గమకాండము 1:1 ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను.

నిర్గమకాండము 1:2 దాను నఫ్తాలి గాదు ఆషేరు.

నిర్గమకాండము 1:3 వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.

నిర్గమకాండము 1:4 యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.

నిర్గమకాండము 1:5 అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.

నిర్గమకాండము 6:14 వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.

నిర్గమకాండము 6:15 షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.

నిర్గమకాండము 6:16 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

నిర్గమకాండము 6:17 గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.

నిర్గమకాండము 6:18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

1దినవృత్తాంతములు 2:1 ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను

1దినవృత్తాంతములు 2:2 దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.

1దినవృత్తాంతములు 2:3 యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.

1దినవృత్తాంతములు 2:4 మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదుగురు.

1దినవృత్తాంతములు 2:5 పెరెసు కుమారులు హెస్రోను హామూలు.

1దినవృత్తాంతములు 2:6 జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.

1దినవృత్తాంతములు 2:7 కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.

1దినవృత్తాంతములు 2:8 ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.

1దినవృత్తాంతములు 2:9 హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.

1దినవృత్తాంతములు 2:10 రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.

1దినవృత్తాంతములు 2:11 నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,

1దినవృత్తాంతములు 2:12 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,

1దినవృత్తాంతములు 2:13 యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను

1దినవృత్తాంతములు 2:14 నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని

1దినవృత్తాంతములు 2:15 ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.

1దినవృత్తాంతములు 2:16 సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.

1దినవృత్తాంతములు 2:17 అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.

1దినవృత్తాంతములు 2:18 హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.

1దినవృత్తాంతములు 2:19 అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.

1దినవృత్తాంతములు 2:20 హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.

1దినవృత్తాంతములు 2:21 తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.

1దినవృత్తాంతములు 2:22 సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్టణములుండెను.

1దినవృత్తాంతములు 2:23 మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణములను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.

1దినవృత్తాంతములు 2:24 కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.

1దినవృత్తాంతములు 2:25 హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.

1దినవృత్తాంతములు 2:26 అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.

1దినవృత్తాంతములు 2:27 యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.

1దినవృత్తాంతములు 2:28 ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.

1దినవృత్తాంతములు 2:29 అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను.

1దినవృత్తాంతములు 2:30 నాదాబు కుమారులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను

1దినవృత్తాంతములు 2:31 అప్పయీము కుమారులలో ఇషీ అను ఒకడుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,

1దినవృత్తాంతములు 2:32 షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను; యెతెరు సంతానములేకుండ చనిపోయెను.

1దినవృత్తాంతములు 2:33 యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు.

1దినవృత్తాంతములు 2:34 షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి; ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు

1దినవృత్తాంతములు 2:35 షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.

1దినవృత్తాంతములు 2:36 అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,

1దినవృత్తాంతములు 2:37 జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,

1దినవృత్తాంతములు 2:38 ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,

1దినవృత్తాంతములు 2:39 అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,

1దినవృత్తాంతములు 2:40 ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,

1దినవృత్తాంతములు 2:41 షల్లూము యెకమ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.

1దినవృత్తాంతములు 2:42 యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.

1దినవృత్తాంతములు 2:43 హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.

1దినవృత్తాంతములు 2:44 షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.

1దినవృత్తాంతములు 2:45 షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.

1దినవృత్తాంతములు 2:46 కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.

1దినవృత్తాంతములు 2:47 యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు.

1దినవృత్తాంతములు 2:48 కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.

1దినవృత్తాంతములు 2:49 మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బేనాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.

1దినవృత్తాంతములు 2:50 ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,

1దినవృత్తాంతములు 2:51 బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారేపును.

1దినవృత్తాంతములు 2:52 కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవరనగా హారోయే హజీహమ్మీను హోతు.

1దినవృత్తాంతములు 2:53 కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మాతీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయులును ఎష్తాయులీయులును కలిగిరి.

1దినవృత్తాంతములు 2:54 శల్మా కుమారులెవరనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును.

1దినవృత్తాంతములు 2:55 యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటివారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు.

1దినవృత్తాంతములు 8:1 బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,

1దినవృత్తాంతములు 8:2 మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.

1దినవృత్తాంతములు 8:3 బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు

1దినవృత్తాంతములు 8:4 అబీషూవ నయమాను అహోయహు

1దినవృత్తాంతములు 8:5 గెరా షెపూపాను హూరాము

1దినవృత్తాంతములు 8:6 ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటిపెద్దలుగా నుండిరి;

1దినవృత్తాంతములు 8:7 నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొనిపోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొనిపోయెను.

1దినవృత్తాంతములు 8:8 వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక

1దినవృత్తాంతములు 8:9 తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును

1దినవృత్తాంతములు 8:10 యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.

1దినవృత్తాంతములు 8:11 హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.

1దినవృత్తాంతములు 8:12 ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.

1దినవృత్తాంతములు 8:13 బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.

1దినవృత్తాంతములు 8:14 అహ్యోషాషకు యెరేమోతు

1దినవృత్తాంతములు 8:15 జెబద్యా అరాదు ఏదెరు

1దినవృత్తాంతములు 8:16 మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.

1దినవృత్తాంతములు 8:17 జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు

1దినవృత్తాంతములు 8:18 ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.

1దినవృత్తాంతములు 8:19 యాకీము జిఖ్రీ జిబ్ది

1దినవృత్తాంతములు 8:20 ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.

1దినవృత్తాంతములు 8:21 అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు.

1దినవృత్తాంతములు 8:22 ఇష్పాను ఏబెరు ఎలీయేలు

1దినవృత్తాంతములు 8:23 అబ్దోను జిఖ్రీ హానాను

1దినవృత్తాంతములు 8:24 హనన్యా ఏలాము అంతోతీయా

1దినవృత్తాంతములు 8:25 ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.

1దినవృత్తాంతములు 8:26 షంషెరై షెహర్యా అతల్యా

1దినవృత్తాంతములు 8:27 యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.

1దినవృత్తాంతములు 8:28 వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునైయుండి యెరూషలేమునందు కాపురముండిరి.

1దినవృత్తాంతములు 8:29 గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్యపేరు మయకా;

1దినవృత్తాంతములు 8:30 ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు

1దినవృత్తాంతములు 8:31 గెదోరు అహ్యో జెకెరు అనువారు.

1దినవృత్తాంతములు 8:32 మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి.

1దినవృత్తాంతములు 8:33 నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

1దినవృత్తాంతములు 8:34 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

1దినవృత్తాంతములు 8:35 మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.

1దినవృత్తాంతములు 8:36 ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

1దినవృత్తాంతములు 8:37 మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.

1దినవృత్తాంతములు 8:38 ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.

1దినవృత్తాంతములు 8:39 అతని సహోదరుడైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవవాడు.

1దినవృత్తాంతములు 8:40 ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారులును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యామీనీయులు.

ఆదికాండము 29:32 లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.

ఆదికాండము 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.

ఆదికాండము 35:23 యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.

ఆదికాండము 49:3 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.

ఆదికాండము 49:4 నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.

నిర్గమకాండము 6:14 వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.

సంఖ్యాకాండము 1:5 మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;

సంఖ్యాకాండము 1:20 ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది యారువేల ఐదు వందలమంది యైరి.

సంఖ్యాకాండము 1:21 షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు

సంఖ్యాకాండము 2:10 రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణదిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 2:11 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.

సంఖ్యాకాండము 2:12 అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 2:13 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడువందలమంది.

సంఖ్యాకాండము 26:5 ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:6 పల్లువీయులు పల్లు వంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు;

సంఖ్యాకాండము 26:7 వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది.

సంఖ్యాకాండము 26:8 పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము.

సంఖ్యాకాండము 26:9 కోరహు తన సమూహములో పేరుపొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.

సంఖ్యాకాండము 26:10 ఆ సమూహపువారు మృతిబొందినప్పుడు అగ్ని రెండువందల ఏబదిమందిని భక్షించినందునను, భూమి తన నోరుతెరచి వారిని కోరహును మింగివేసినందునను, వారు దృష్టాంతములైరి.

సంఖ్యాకాండము 26:11 అయితే కోరహు కుమారులు చావలేదు.

ద్వితియోపదేశాకాండము 33:6 రూబేను బ్రదికి చావకయుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు.

1దినవృత్తాంతములు 2:1 ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను

1దినవృత్తాంతములు 2:2 దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.

1దినవృత్తాంతములు 2:3 యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.

1దినవృత్తాంతములు 2:4 మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదుగురు.

1దినవృత్తాంతములు 2:5 పెరెసు కుమారులు హెస్రోను హామూలు.

1దినవృత్తాంతములు 2:6 జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.

1దినవృత్తాంతములు 2:7 కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.

1దినవృత్తాంతములు 2:8 ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.

1దినవృత్తాంతములు 2:9 హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.

1దినవృత్తాంతములు 2:10 రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.

ఆదికాండము 42:13 అందుకు వారు నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లెడు అని ఉత్తరమిచ్చిరి

రూతు 4:11 అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలును మేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;

1దినవృత్తాంతములు 5:1 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మస్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు.

మత్తయి 1:2 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను;