Logo

ఆదికాండము అధ్యాయము 46 వచనము 24

ఆదికాండము 30:7 రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.

ఆదికాండము 30:8 అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.

ఆదికాండము 35:25 రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.

ఆదికాండము 49:21 నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును.

సంఖ్యాకాండము 1:15 నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.

సంఖ్యాకాండము 1:42 నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

సంఖ్యాకాండము 1:43 నఫ్తాలి గోత్రములో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగు వందలమంది యైరి.

సంఖ్యాకాండము 26:48 నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీయులు గూనీ వంశస్థులు;

సంఖ్యాకాండము 26:49 యేసెరీయులు యేసెరు వంశస్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.

సంఖ్యాకాండము 26:50 వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబది యయిదువేల నాలుగువందలమంది

ద్వితియోపదేశాకాండము 33:23 నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.

2రాజులు 15:29 ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొనిపోయెను.

1దినవృత్తాంతములు 2:2 దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.

1దినవృత్తాంతములు 12:34 నఫ్తాలీయులలో వెయ్యిమంది అధిపతులు, వారితోకూడ డాలును ఈటెను పట్టుకొనిన వారు ముప్పది యేడువేలమంది.

1దినవృత్తాంతములు 7:13 నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.

1దినవృత్తాంతములు 5:15 గూనీ కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరుల యిండ్లవారికి పెద్ద.