Logo

ఆదికాండము అధ్యాయము 46 వచనము 18

ఆదికాండము 29:24 మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.

ఆదికాండము 30:9 లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.

ఆదికాండము 30:10 లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా

ఆదికాండము 30:11 లేయా ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను.

ఆదికాండము 30:12 లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా

ఆదికాండము 30:13 లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.

ఆదికాండము 35:26 లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.

నిర్గమకాండము 1:4 యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.

ఆదికాండము 46:27 ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.