Logo

ఆదికాండము అధ్యాయము 46 వచనము 17

ఆదికాండము 30:13 లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.

ఆదికాండము 35:26 లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.

ఆదికాండము 49:20 ఆషేరు నొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.

సంఖ్యాకాండము 1:13 ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు

సంఖ్యాకాండము 1:40 ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

సంఖ్యాకాండము 1:41 ఆషేరు గోత్రములో లెక్కింపబడినవారు నలువది యొకవేయి ఐదు వందలమంది యైరి.

సంఖ్యాకాండము 26:44 ఆషేరు పుత్రుల వంశములలో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;

సంఖ్యాకాండము 26:45 బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:46 ఆషేరు కుమార్తె పేరు శెరహు.

ద్వితియోపదేశాకాండము 33:24 ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.

1దినవృత్తాంతములు 2:2 దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.

1దినవృత్తాంతములు 7:30 ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.

1దినవృత్తాంతములు 7:31 బెరీయా కుమారులు హెబెరు మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి.

1దినవృత్తాంతములు 7:32 హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను.

1దినవృత్తాంతములు 7:33 యప్లేటు కుమారులెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.

1దినవృత్తాంతములు 7:34 షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.

1దినవృత్తాంతములు 7:35 వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.

1దినవృత్తాంతములు 7:36 జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా

1దినవృత్తాంతములు 7:37 బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర.

1దినవృత్తాంతములు 7:38 ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా.

1దినవృత్తాంతములు 7:39 ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా.

1దినవృత్తాంతములు 7:40 ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలును ప్రఖ్యాతినొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునైయుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.

నిర్గమకాండము 1:4 యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.

సంఖ్యాకాండము 26:46 ఆషేరు కుమార్తె పేరు శెరహు.

1దినవృత్తాంతములు 4:18 అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరెదును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.

1దినవృత్తాంతములు 5:13 వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబయోరై యకాను జీయ ఏబెరు.