Logo

లేవీయకాండము అధ్యాయము 19 వచనము 5

లేవీయకాండము 3:1 అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొనివచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 3:2 తాను అర్పించుదాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

లేవీయకాండము 3:3 అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని రెండు మూత్రగ్రంధులను వాటిమీదను

లేవీయకాండము 3:4 డొక్కలమీదనున్న క్రొవ్వును కాలేజముమీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింవలెను.

లేవీయకాండము 3:5 అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

లేవీయకాండము 3:6 యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱ మేకలలోనిదైనయెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొనిరావలెను.

లేవీయకాండము 3:7 అతడర్పించు అర్పణము గొఱ్ఱపిల్లయైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 3:8 తాను అర్పించుదాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

లేవీయకాండము 3:9 ఆ సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని

లేవీయకాండము 3:10 రెండు మూత్రగ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును మూత్రగ్రంథులమీది కాలేజముయొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను.

లేవీయకాండము 3:11 యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమ రూపమైన ఆహారము.

లేవీయకాండము 3:12 అతడు అర్పించునది మేకయైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 3:13 తాను దాని తలమీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

లేవీయకాండము 3:14 తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని

లేవీయకాండము 3:15 రెండు మూత్రగ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్రగ్రంథులపైనున్న కాలేజముయొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను.

లేవీయకాండము 3:16 యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు.

లేవీయకాండము 3:17 అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.

లేవీయకాండము 7:16 అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దానినర్పించునాడే తినవలెను.

లేవీయకాండము 22:21 ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధానబలి రూపముగా గోవునైనను గొఱ్ఱనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషములేనిదై యుండవలెను; దానిలో కళంకమేదియు నుండకూడదు.

నిర్గమకాండము 24:5 ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహన బలులనర్పించి యెహోవాకు సమాధాన బలులగా కోడెలను వధించిరి.

2దినవృత్తాంతములు 31:2 అంతట హిజ్కియా యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులను సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారములయొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను.

యెహెజ్కేలు 45:15 మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱలలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను.

యెహెజ్కేలు 45:16 ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన యీ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరును బద్ధులైయుందురు.

యెహెజ్కేలు 45:17 పండుగలలోను, అమావాస్య దినములలోను, విశ్రాంతిదినములలోను, ఇశ్రాయేలీయులు కూడుకొను నియామకకాలములలోను వాడబడు దహనబలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థ బలిపశువులను నైవేద్యములను దహనబలులను సమాధాన బలిపశువులను సిధ్దపరచవలెను.

యెహెజ్కేలు 46:2 అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధపరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికిపోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు.

యెహెజ్కేలు 46:12 యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు తూర్పుతట్టు గుమ్మము తీయవలెను; విశ్రాంతిదినమున అర్పించునట్లు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవలెను; అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను.

ఎఫెసీయులకు 2:13 అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.

ఎఫెసీయులకు 2:14 ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

లేవీయకాండము 1:3 అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగదానిని తీసికొనిరావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 22:19 వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱమేకలలోనుండి యైనను దోషములేని మగదానిని అర్పింపవలెను.

లేవీయకాండము 22:23 కురూపియైన కోడెనైనను గొఱ్ఱ మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు.

లేవీయకాండము 22:29 మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీకొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను.