Logo

లేవీయకాండము అధ్యాయము 19 వచనము 23

లేవీయకాండము 14:34 నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగజేసినయెడల

లేవీయకాండము 12:3 ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను.

లేవీయకాండము 22:27 దూడయేగాని, గొఱ్ఱపిల్లయేగాని, మేకపిల్లయేగాని, పుట్టినప్పుడు అది యేడు దినములు దాని తల్లితో నుండవలెను. ఎనిమిదవనాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింప తగును.

నిర్గమకాండము 6:12 అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

నిర్గమకాండము 6:30 మోషే చిత్తగించుము; నేను మాటమాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

నిర్గమకాండము 22:29 నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను.

నిర్గమకాండము 22:30 అట్లే నీ యెద్దులను నీ గొఱ్ఱలను అర్పింపవలెను. ఏడు దినములు అది దాని తల్లియొద్ద ఉండవలెను. ఎనిమిదవ దినమున దానిని నాకియ్యవలెను.

యిర్మియా 6:10 విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్యమిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.

యిర్మియా 9:25 అన్యజనులందరును సున్నతి పొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయ సంబంధమైన సున్నతి నొందినవారుకారు గనుక, రాబోవు దినములలో సున్నతిపొందియు సున్నతి లేనివారివలెనుండు

యిర్మియా 9:26 ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.

అపోస్తలులకార్యములు 7:51 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.

లేవీయకాండము 23:14 మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టెయేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.

ద్వితియోపదేశాకాండము 20:6 ద్రాక్షతోటవేసి యింక దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు దాని పండ్లు తినునుగనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.

నెహెమ్యా 10:35 మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను, ప్రతి సవంత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి

యిర్మియా 31:5 నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు.

లూకా 13:7 గనుక అతడు ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను.