Logo

లేవీయకాండము అధ్యాయము 19 వచనము 33

నిర్గమకాండము 22:21 పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులైయుంటిరి గదా.

నిర్గమకాండము 23:9 పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులైయుంటిరిగదా.

ద్వితియోపదేశాకాండము 10:18 ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.

ద్వితియోపదేశాకాండము 10:19 మీరు ఐగుప్తు దేశములో పరదేశులైయుంటిరి గనుక పరదేశిని జాలితలచుడి.

ద్వితియోపదేశాకాండము 24:14 నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడియ్యవలెను.

మలాకీ 3:5 తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యిర్మియా 7:6 పరదేశులను తండ్రిలేనివారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల

యెహెజ్కేలు 22:7 నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,

యెహెజ్కేలు 22:29 మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.

ద్వితియోపదేశాకాండము 14:21 చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.

ద్వితియోపదేశాకాండము 23:20 అన్యునికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచుకొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.