Logo

మత్తయి అధ్యాయము 26 వచనము 21

మార్కు 14:17 సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతో కూడ వచ్చెను.

మార్కు 14:18 వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా

మార్కు 14:19 వారు దుఃఖపడి నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి.

మార్కు 14:20 అందుకాయన పండ్రెండుమందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచువాడే.

మార్కు 14:21 నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను.

లూకా 22:14 ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి.

లూకా 22:15 అప్పుడాయన నేను శ్రమపడక మునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.

లూకా 22:16 అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి

యోహాను 13:21 యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను

నిర్గమకాండము 12:11 మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలుచేత పట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.

పరమగీతము 1:12 రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను.

ద్వితియోపదేశాకాండము 16:6 నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరివచ్చినbవేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి

మత్తయి 10:1 ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికారమిచ్చెను.