Logo

మత్తయి అధ్యాయము 26 వచనము 74

లూకా 22:59 మరికొంతసేపటికి మరియొకడు అతని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయీ, నేను కాననెను.

లూకా 22:60 ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు నిజముగా వీడును అతనితో కూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను.

యోహాను 18:26 పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధానయాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు

యోహాను 18:27 పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.

న్యాయాధిపతులు 12:6 అందుకతడునేను కాను అనినయెడల వారు అతని చూచిషిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడి పోయిరి.

నెహెమ్యా 13:24 వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ యా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.

న్యాయాధిపతులు 18:3 వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా యింటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా యింటియొద్ద నున్నప్పుడు, లేవీయుడైన ఆ యౌవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని యడుగగా

మార్కు 14:70 అతడు మరల నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.

యోహాను 21:17 మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.

అపోస్తలులకార్యములు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.