Logo

మత్తయి అధ్యాయము 26 వచనము 24

కీర్తనలు 41:9 నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజనము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను

లూకా 22:21 ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడ ఈ బల్లమీద ఉన్నది.

యోహాను 13:18 మిమ్మునందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని నాతో కూడ భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.

యోహాను 13:26 అందుకు యేసు నేనొక ముక్క ముంచి యెవనికిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను;

యోహాను 13:27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా

యోహాను 13:28 ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు.

దానియేలు 11:26 ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు; మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు.

మీకా 7:6 కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు.

మార్కు 14:20 అందుకాయన పండ్రెండుమందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచువాడే.

లూకా 22:3 అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను