Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 19 వచనము 27

అపోస్తలులకార్యములు 19:10 రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.

అపోస్తలులకార్యములు 19:18 విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి.

అపోస్తలులకార్యములు 19:19 మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్కచూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.

అపోస్తలులకార్యములు 19:20 ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.

1కొరిందీయులకు 16:8 గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు.

1కొరిందీయులకు 16:9 కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.

1దెస్సలోనీకయులకు 1:9 మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును,

అపోస్తలులకార్యములు 14:15 అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేముకూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము

అపోస్తలులకార్యములు 17:29 కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు.

కీర్తనలు 115:4 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు

కీర్తనలు 115:5 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

కీర్తనలు 115:6 చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు

కీర్తనలు 115:7 చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.

కీర్తనలు 115:8 వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.

కీర్తనలు 135:15 అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు.

కీర్తనలు 135:16 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

కీర్తనలు 135:17 చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.

కీర్తనలు 135:18 వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు.

యెషయా 44:10 ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు?

యెషయా 44:11 ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగుచేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.

యెషయా 44:12 కమ్మరి గొడ్డలి పదునుచేయుచు నిప్పులతో పనిచేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును

యెషయా 44:13 వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చక్కచేయును కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యము గలదానిగాను చేయును.

యెషయా 44:14 ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును శ్మశానావృక్షమును గాని సరళవృక్షమును గాని సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును

యెషయా 44:15 ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును.

యెషయా 44:16 అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు

యెషయా 44:17 దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.

యెషయా 44:18 వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను.

యెషయా 44:19 ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు.

యెషయా 44:20 వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవుచున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు.

యెషయా 46:5 మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు?

యెషయా 46:6 దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచినుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు.

యెషయా 46:7 వారు భుజముమీద దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.

యెషయా 46:8 దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి

యిర్మియా 10:3 జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని.

యిర్మియా 10:4 వెండి బంగారములచేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు.

యిర్మియా 10:5 అవి తాటిచెట్టువలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హాని చేయనేరవు మేలుచేయుట వాటివలనకాదు.

యిర్మియా 10:11 మీరు వారితో ఈలాగు చెప్పవలెను ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండకుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును.

యిర్మియా 10:14 తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమునుబట్టి అవమానము నొందుచున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.

యిర్మియా 10:15 అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించిపోవును,

హోషేయ 8:6 అది ఇశ్రాయేలువారిచేతిపనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.

1కొరిందీయులకు 8:4 కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.

1కొరిందీయులకు 10:19 ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?

1కొరిందీయులకు 10:20 లేదుగాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు.

1కొరిందీయులకు 12:2 మీరు అన్యజనులైయున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.

గలతీయులకు 4:8 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులైయుంటిరి గాని

అపోస్తలులకార్యములు 19:35 అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతి యొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియనివాడెవడు

ఆదికాండము 35:2 యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరితోను మీయొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.

నిర్గమకాండము 20:4 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

నిర్గమకాండము 32:1 మాషే కొండ దిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.

నిర్గమకాండము 34:17 పోతపోసిన దేవతలను చేసికొనవలదు.

న్యాయాధిపతులు 18:24 అందు కతడునేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టు కొని పోవుచున్నారే, యిక నాయొద్ద ఏమియున్నది? నీకేమి కావలెననుచున్నారే, అదే మన్నమాట అనగా

1దినవృత్తాంతములు 16:26 జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు.

2దినవృత్తాంతములు 13:9 మీరు అహరోను సంతతివారైన యెహోవా యాజకులను, లేవీయులను త్రోసివేసి, అన్యదేశముల జనులు చేయునట్లు మీకొరకు యాజకులను నియమించుకొంటిరి గదా? ఒక కోడెతోను ఏడు గొఱ్ఱ పొట్టేళ్లతోను తన్ను ప్రతిష్ఠించుటకైవచ్చు ప్రతివాడు, దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు.

2దినవృత్తాంతములు 32:13 నేనును నా పితరులును ఇతరదేశముల జనులకందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నాచేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా?

2దినవృత్తాంతములు 32:15 కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి, యే జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నాచేతిలో నుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నాచేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవునుగదా అనెను.

నెహెమ్యా 2:10 హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.

కీర్తనలు 96:5 జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు.

యిర్మియా 16:20 నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.

దానియేలు 3:1 రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ యొకటి చేయించి, బబులోను దేశములోని దూరాయను మైదానములో దాని నిలువబెట్టించెను. అది అరువది మూరల ఎత్తును ఆరు మూరల వెడల్పునై యుండెను.

యోహాను 3:26 గనుక వారు యోహాను నొద్దకు వచ్చి బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీవెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి.

అపోస్తలులకార్యములు 6:9 అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని

అపోస్తలులకార్యములు 13:49 ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను

అపోస్తలులకార్యములు 16:6 ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారినాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని

అపోస్తలులకార్యములు 18:4 అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.

అపోస్తలులకార్యములు 18:19 వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను.

అపోస్తలులకార్యములు 19:34 అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏక శబ్దముతో రెండు గంటలసేపు ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి.

అపోస్తలులకార్యములు 21:28 ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ద స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి

2కొరిందీయులకు 5:11 కావున మేము ప్రభువు విషయమైన భయమునెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.

2కొరిందీయులకు 6:9 మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్నవారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము;

గలతీయులకు 2:8 అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,

ప్రకటన 9:20 ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.