Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 19 వచనము 33

అపోస్తలులకార్యములు 19:29 పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి.

అపోస్తలులకార్యములు 21:34 సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను.

అపోస్తలులకార్యములు 19:40 మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను.

మత్తయి 11:7 వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?

మత్తయి 11:8 సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా.

మత్తయి 11:9 మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.

లూకా 7:24 యోహానుదూతలు వెళ్లిన తరువాత, ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా?

లూకా 7:25 మరేమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని, సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు.

లూకా 7:26 అయితే మరేమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.

అపోస్తలులకార్యములు 21:22 కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు.