Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 19 వచనము 32

అపోస్తలులకార్యములు 19:10 రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.

అపోస్తలులకార్యములు 16:6 ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారినాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని

సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

అపోస్తలులకార్యములు 21:12 ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని

అపోస్తలులకార్యములు 2:9 పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు,

1కొరిందీయులకు 4:9 మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము.

2తిమోతి 1:15 ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు.