Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 25 వచనము 6

అపోస్తలులకార్యములు 25:16 అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖాముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని

అపోస్తలులకార్యములు 23:30 కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.

అపోస్తలులకార్యములు 24:8 మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.

అపోస్తలులకార్యములు 25:18 నేరము మోపినవారు నిలిచినప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు.

అపోస్తలులకార్యములు 25:19 అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;

అపోస్తలులకార్యములు 25:25 ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించియున్నాను.

అపోస్తలులకార్యములు 18:14 పౌలు నోరుతెరచి మాటలాడబోగా గల్లియోను యూదులారా, యిదియొక అన్యాయముగాని చెడ్డ నేరముగాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే.

1సమూయేలు 24:11 నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు.

1సమూయేలు 24:12 నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చును గాని నేను నిన్ను చంపను.

కీర్తనలు 7:3 యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసినయెడల

కీర్తనలు 7:4 నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల

కీర్తనలు 7:5 శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా.(సెలా.)

యోహాను 18:29 కావున పిలాతు బయట ఉన్న వారియొద్దకు వచ్చిఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.

యోహాను 18:30 అందుకు వారు వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి.