Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 25 వచనము 7

అపోస్తలులకార్యములు 25:10 అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడియున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును.

అపోస్తలులకార్యములు 25:17 కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొనిరమ్మని ఆజ్ఞాపించితిని.

అపోస్తలులకార్యములు 18:12 గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి

అపోస్తలులకార్యములు 18:13 వీడు ధర్మ శాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి.

అపోస్తలులకార్యములు 18:14 పౌలు నోరుతెరచి మాటలాడబోగా గల్లియోను యూదులారా, యిదియొక అన్యాయముగాని చెడ్డ నేరముగాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే.

అపోస్తలులకార్యములు 18:15 ఇది యేదోయుక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి

అపోస్తలులకార్యములు 18:16 వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను.

అపోస్తలులకార్యములు 18:17 అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు.

మత్తయి 27:19 అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతనియొద్దకు వర్తమానము పంపెను

యోహాను 19:13 పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు.

2కొరిందీయులకు 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

యాకోబు 2:6 అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా?

అపోస్తలులకార్యములు 21:15 ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతివిు.

అపోస్తలులకార్యములు 23:30 కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.