Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 25 వచనము 10

అపోస్తలులకార్యములు 25:3 మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి.

అపోస్తలులకార్యములు 25:20 ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనో యేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింపబడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని.

అపోస్తలులకార్యములు 12:3 ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.

అపోస్తలులకార్యములు 24:27 రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను.

మార్కు 15:15 పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

నిర్గమకాండము 23:2 దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు;

దానియేలు 6:16 అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.

మత్తయి 27:15 జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదలచేయుట అధిపతికి వాడుక.

మార్కు 15:6 ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.

అపోస్తలులకార్యములు 12:11 పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.

అపోస్తలులకార్యములు 18:22 తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను.

అపోస్తలులకార్యములు 21:15 ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతివిు.

అపోస్తలులకార్యములు 26:17 నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;