Logo

రోమీయులకు అధ్యాయము 2 వచనము 14

రోమీయులకు 2:25 నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును.

ద్వితియోపదేశాకాండము 4:1 కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి.

ద్వితియోపదేశాకాండము 5:1 మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్లనెను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి.

ద్వితియోపదేశాకాండము 6:3 కాబట్టి ఇశ్రాయేలూ, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలుకలిగి బహుగా అభివృద్ధినొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను.

ద్వితియోపదేశాకాండము 30:12 మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు;

ద్వితియోపదేశాకాండము 30:13 మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మనయొద్దకు దాని తెచ్చును అని నీవనుకొననేల? అది సముద్రపు అద్దరి మించునది కాదు.

ద్వితియోపదేశాకాండము 30:14 నీవు దాని ననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృదయమున నీ నోట నున్నది.

యెహెజ్కేలు 20:11 వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును.

యెహెజ్కేలు 33:30 మరియు నరపుత్రుడా; నీ జనుల గోడదగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్నుగూర్చి మాటలాడుదురు, ఒకరినొకరు చూచిపోదము రండి, యెహోవా యొద్దనుండి బయలుదేరు మాట యెట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు.

యెహెజ్కేలు 33:31 నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది.

యెహెజ్కేలు 33:32 నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి నడుచుకొనరు.

యెహెజ్కేలు 33:33 అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త యొకడు తమ మధ్యనుండెనని వారు తెలిసికొందురు.

మత్తయి 7:21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

మత్తయి 7:22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.

మత్తయి 7:23 అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

మత్తయి 7:24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

మత్తయి 7:25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

మత్తయి 7:26 మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

మత్తయి 7:27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.

లూకా 8:21 అందుకాయన దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.

యాకోబు 1:22 మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.

యాకోబు 1:23 ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.

యాకోబు 1:24 వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా

యాకోబు 1:25 అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.

1యోహాను 2:29 ఆయన నీతిమంతుడని మీరెరిగియున్నయెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు.

1యోహాను 3:7 చిన్నపిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు.

రోమీయులకు 3:20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

రోమీయులకు 3:23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.

రోమీయులకు 10:5 ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు.

లూకా 10:25 ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను.

లూకా 10:26 అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీవేమి చదువుచున్నావని అతని నడుగగా

లూకా 10:27 అతడునీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని చెప్పెను

లూకా 10:28 అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను.

లూకా 10:29 అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు అవునుగాని నా పొరుగువాడెవడని యేసునడిగెను.

గలతీయులకు 3:11 ధర్మశాస్త్రముచేత ఎవడును దేవుని యెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.

గలతీయులకు 3:12 ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదుగాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.

రోమీయులకు 3:30 దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.

రోమీయులకు 4:2 అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.

రోమీయులకు 4:3 లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను

రోమీయులకు 4:4 పనిచేయువానికి జీతము ఋణమే గాని దానమని యెంచబడదు.

రోమీయులకు 4:5 పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

కీర్తనలు 143:2 నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు.

లూకా 18:14 అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను

అపోస్తలులకార్యములు 13:39 మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక.

గలతీయులకు 2:16 ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.

గలతీయులకు 5:4 మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడి యున్నారు, కృపలోనుండి తొలగిపోయి యున్నారు.

యాకోబు 2:21 మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?

యాకోబు 2:22 విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?

యాకోబు 2:23 కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను.

యాకోబు 2:24 మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.

యాకోబు 2:25 అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?

ఆదికాండము 6:11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి యుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.

నిర్గమకాండము 35:1 మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేసి మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా

1రాజులు 8:32 నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయము తీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతిచొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.

కీర్తనలు 25:10 ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపా సత్యమయములై యున్నవి

యిర్మియా 11:6 యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా నీవు యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుము మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటి ననుసరించి నడుచుకొనుడి.

యోహాను 7:19 మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 10:35 ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.

రోమీయులకు 4:15 ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేకపోవును.

గలతీయులకు 3:19 ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతిక్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.

యాకోబు 4:11 సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించు వాడవైతివి.