Logo

రోమీయులకు అధ్యాయము 4 వచనము 5

రోమీయులకు 9:32 వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియలమూలముగా నైనట్లు దానిని వెంటాడిరి.

రోమీయులకు 11:6 అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.

రోమీయులకు 11:35 ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు?

మత్తయి 20:1 ఏలాగనగా పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి

మత్తయి 20:2 దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.

మత్తయి 20:3 తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి

మత్తయి 20:4 మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.

మత్తయి 20:5 దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.

మత్తయి 20:6 తిరిగి దాదాపు అయిదు గంటలకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా

మత్తయి 20:7 వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.

మత్తయి 20:8 సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చినవారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను.

మత్తయి 20:9 దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారము చొప్పున తీసికొనిరి.

మత్తయి 20:10 మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారము చొప్పుననే దొరకెను.

మత్తయి 20:11 వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను,

మత్తయి 20:12 పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజమానునిమీద సణుగుకొనిరి.

మత్తయి 20:13 అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము;

మత్తయి 20:14 నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది;

మత్తయి 20:15 నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను.

మత్తయి 20:16 ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.

ఆదికాండము 6:8 అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.

2దినవృత్తాంతములు 15:7 కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.

కీర్తనలు 33:18 వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును

యోహాను 6:29 యేసు ఆయన పంపినవానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 20:24 అయితే దేవుని కృపా సువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు

గలతీయులకు 3:12 ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదుగాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.

గలతీయులకు 5:4 మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడి యున్నారు, కృపలోనుండి తొలగిపోయి యున్నారు.

కొలొస్సయులకు 3:24 మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.

2దెస్సలోనీకయులకు 2:16 మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,

తీతుకు 2:11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణ కరమైన దేవుని కృప ప్రత్యక్షమై

తీతుకు 3:7 నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణనుబట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.