Logo

రోమీయులకు అధ్యాయము 15 వచనము 29

ఫిలిప్పీయులకు 4:17 నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను.

కొలొస్సయులకు 1:6 ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిననాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.

రోమీయులకు 15:24 నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంతమట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.

సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.

విలాపవాక్యములు 3:37 ప్రభువు సెలవులేనిది మాటయిచ్చి నెరవేర్చగలవాడెవడు?

యాకోబు 4:13 నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా,

యాకోబు 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

యాకోబు 4:15 కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అదిచేతమని చెప్పుకొనవలెను.

యోబు 33:16 నరులు గర్విష్ఠులు కాకుండ చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు

పరమగీతము 4:16 ఉత్తర వాయువూ, ఏతెంచుము దక్షిణ వాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక.

యెషయా 19:21 ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసికొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు.

యెహెజ్కేలు 28:12 నరపుత్రుడా, తూరు రాజునుగూర్చి అంగలార్పువచనమెత్తి ఈలాగు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా పూర్ణజ్ఞానమును సంపూర్ణ సౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి

అపోస్తలులకార్యములు 25:12 అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను.

ఫిలిప్పీయులకు 1:11 వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.

ఫిలిప్పీయులకు 2:24 నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ముచున్నాను.

తీతుకు 3:14 మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమునుబట్టి సమయోచితముగా సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను.

హెబ్రీయులకు 13:23 మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితో కూడ వచ్చి మిమ్మును చూచెదను.