Logo

సంఖ్యాకాండము అధ్యాయము 5 వచనము 15

లేవీయకాండము 5:11 రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకనియెడల పాపము చేసినవాడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతును పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను. అది పాపపరిహారార్థబలి గనుక దానిమీద నూనె పోయవలదు. సాంబ్రాణి దానిమీద ఉంచవలదు.

హోషేయ 3:2 కాగా నేను పదునైదు తులముల వెండియు ఏదుము యవలును తీసికొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని

1రాజులు 17:18 ఆమె ఏలీయాతో దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నాయొద్దకు వచ్చితివా అని మనవిచేయగా

యెహెజ్కేలు 29:16 ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారితట్టు తిరిగినయెడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

హెబ్రీయులకు 10:3 అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి

సంఖ్యాకాండము 5:18 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తలముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను.

సంఖ్యాకాండము 5:25 మరియు యాజకుడు ఆ స్త్రీ చేతినుండి దోషవిషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునొద్దకు దాని తేవలెను.

సంఖ్యాకాండము 5:29 రోషము విషయమైన విధి యిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవతప్పి అపవిత్రపడినయెడలనేమి,

యెహెజ్కేలు 21:23 ప్రమాణములు చేసికొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లు వారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును.