Logo

సంఖ్యాకాండము అధ్యాయము 5 వచనము 19

మత్తయి 26:63 అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు నీవన్నట్టే.

రోమీయులకు 7:2 భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయినయెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదలపొందును.

సంఖ్యాకాండము 5:12 ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహము చేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించినయెడల

సంఖ్యాకాండము 5:28 ఆ స్త్రీ అపవిత్రపరపబడక పవిత్రురాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగునని చెప్పుము.

సంఖ్యాకాండము 5:29 రోషము విషయమైన విధి యిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవతప్పి అపవిత్రపడినయెడలనేమి,

ద్వితియోపదేశాకాండము 21:7 మాచేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు.

యెహోషువ 6:26 ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెనుఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువ నెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును;

2దినవృత్తాంతములు 6:22 ఎవడైనను తన పొరుగువానియెడల తప్పుచేసినప్పుడు అతనిచేత ప్రమాణము చేయించుటకై అతనిమీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు