Logo

సంఖ్యాకాండము అధ్యాయము 14 వచనము 18

నిర్గమకాండము 34:6 అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా.

నిర్గమకాండము 34:7 ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను.

కీర్తనలు 103:8 యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు.

కీర్తనలు 145:8 యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.

యోనా 4:2 యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని.

మీకా 7:18 తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.

నహూము 1:2 యెహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారము చేయును; ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.

నహూము 1:3 యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.

రోమీయులకు 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

రోమీయులకు 3:25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

రోమీయులకు 3:26 క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసముద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

రోమీయులకు 5:21 ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

ఎఫెసీయులకు 1:7 దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

ఎఫెసీయులకు 1:8 కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

నిర్గమకాండము 20:5 ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు

నిర్గమకాండము 34:7 ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను.

యిర్మియా 23:2 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొఱ్ఱలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్‌క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

ఆదికాండము 19:16 అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుటవలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెలచేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి

లేవీయకాండము 26:39 మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.

ద్వితియోపదేశాకాండము 4:31 నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనము చేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.

2దినవృత్తాంతములు 30:18 ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా

నెహెమ్యా 9:17 వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచుకొని, తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగివెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునై యుండి వారిని విసర్జింపలేదు.

యోబు 10:14 నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు.

కీర్తనలు 51:1 దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము

కీర్తనలు 78:38 అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.

కీర్తనలు 86:15 ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు

యెషయా 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.

యెషయా 63:7 యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమునుబట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.

యిర్మియా 32:18 నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.

దానియేలు 9:4 నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థన చేసి యొప్పుకొన్నదేమనగా ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా,

దానియేలు 9:9 మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితివిు; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు.

యోవేలు 2:13 మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునై యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.

రోమీయులకు 2:4 లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?

రోమీయులకు 9:22 ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిననేమి?

రోమీయులకు 11:22 కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహప్రాప్తుడవై నిలిచియున్నయెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువనియెడల నీవును నరికివేయబడుదువు.

యాకోబు 5:11 సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.