Logo

సంఖ్యాకాండము అధ్యాయము 14 వచనము 37

సంఖ్యాకాండము 14:12 నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా

సంఖ్యాకాండము 16:49 కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి.

సంఖ్యాకాండము 25:9 ఇరువది నాలుగువేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి.

యిర్మియా 28:16 కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు భూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను.

యిర్మియా 28:17 ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.

యిర్మియా 29:32 నెహెలామీయుడైన షెమయా యెహోవామీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను; ఈ జనులలో కాపురముండువాడొకడును అతనికి మిగిలియుండడు, నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు; ఇదే యెహోవా వాక్కు.

1కొరిందీయులకు 10:10 మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకునిచేత నశించిరి.

హెబ్రీయులకు 3:17 ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలిపోయెను.

యూదా 1:5 ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.

సంఖ్యాకాండము 13:32 మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.

సంఖ్యాకాండము 20:3 జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు

సంఖ్యాకాండము 22:33 ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుట నుండి తొలగనియెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పెను.

కీర్తనలు 91:3 వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును

కీర్తనలు 91:7 నీ ప్రక్కను వేయిమంది పడినను నీ కుడిప్రక్కను పదివేలమంది కూలినను అపాయము నీయొద్దకు రాదు.

లూకా 19:27 మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.