Logo

సంఖ్యాకాండము అధ్యాయము 21 వచనము 13

సంఖ్యాకాండము 21:14 కాబట్టి యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా

సంఖ్యాకాండము 22:36 బిలాము వచ్చెనని బాలాకు విని, ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణమువరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా

ద్వితియోపదేశాకాండము 2:24 మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీచేతికి అప్పగించితిని. దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.

న్యాయాధిపతులు 11:18 తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.

యెషయా 16:2 గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు.

యిర్మియా 48:20 మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి

సంఖ్యాకాండము 21:24 ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది.

యెహోషువ 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా

న్యాయాధిపతులు 11:15 యెఫ్తా సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు.