Logo

సంఖ్యాకాండము అధ్యాయము 21 వచనము 14

యెహోషువ 10:13 సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.

2సమూయేలు 1:18 అది యాషారు గ్రంథమందు లిఖింపబడియున్నది. ఎట్లనగా

సంఖ్యాకాండము 21:14 కాబట్టి యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా

సంఖ్యాకాండము 21:15 ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది.

సంఖ్యాకాండము 21:16 అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగుచేయుము, నేను వారికి నీళ్లనిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది.

సంఖ్యాకాండము 21:17 అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి బావీ ఉబుకుము. దాని కీర్తించుడి బావీ; యేలికలు దాని త్రవ్విరి

సంఖ్యాకాండము 21:18 తమ అధికార దండములచేతను కఱ్ఱలచేతను జనుల అధికారులు దాని త్రవ్విరి.

సంఖ్యాకాండము 21:19 వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును

సంఖ్యాకాండము 21:20 మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.

సంఖ్యాకాండము 21:13 అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు.

సంఖ్యాకాండము 21:27 కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను

సంఖ్యాకాండము 22:36 బిలాము వచ్చెనని బాలాకు విని, ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణమువరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా

ద్వితియోపదేశాకాండము 1:1 యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.

కీర్తనలు 44:1 దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనినిగూర్చి మేము చెవులార వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి

యిర్మియా 48:20 మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి