Logo

సంఖ్యాకాండము అధ్యాయము 23 వచనము 20

సంఖ్యాకాండము 22:12 అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.

ఆదికాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

ఆదికాండము 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

సంఖ్యాకాండము 22:18 అందుకు బిలాము బాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను.

సంఖ్యాకాండము 22:38 అందుకు బిలాము ఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను.

యోహాను 10:27 నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.

యోహాను 10:28 నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నాచేతిలోనుండి అపహరింపడు.

యోహాను 10:29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రిచేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;

రోమీయులకు 8:38 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,

రోమీయులకు 8:39 మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.

1పేతురు 1:5 కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

సంఖ్యాకాండము 6:27 అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.

సంఖ్యాకాండము 23:8 ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.

సంఖ్యాకాండము 23:12 అందుకతడు యెహోవా నా నోట ఉంచినదాని నేను శ్రధ్ధగా పలుకవద్దా? అని ఉత్తరమిచ్చెను.

సంఖ్యాకాండము 23:27 బాలాకు నీవు దయచేసి రమ్ము; నేను వేరొకచోటికి నిన్ను తోడుకొని పోయెదను; అక్కడనుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను.

సంఖ్యాకాండము 24:1 ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటివలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యమువైపు తన ముఖమును త్రిప్పుకొనెను.

ద్వితియోపదేశాకాండము 33:29 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.

న్యాయాధిపతులు 7:14 అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయు డైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతనిచేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను.

1రాజులు 22:23 యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

యోబు 23:13 అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.

కీర్తనలు 109:28 వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును.

యెషయా 45:19 అంధకార దేశములోని మరుగైనచోటున నేను మాటలాడలేదు మాయాస్వరూపుడనైనట్టు3 నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.

యిర్మియా 38:21 నీవు ఒకవేళ బయలు వెళ్లకపోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను.

అపోస్తలులకార్యములు 4:20 మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;