Logo

సంఖ్యాకాండము అధ్యాయము 27 వచనము 7

సంఖ్యాకాండము 36:1 యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే యెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల యెదుటను మాటలాడి యిట్లనిరి

సంఖ్యాకాండము 36:2 ఆ దేశమును వంతుచీట్లచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవానికాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా యేలినవాడు యెహోవాచేత ఆజ్ఞనొందెను.

కీర్తనలు 68:5 తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేనివారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు

యిర్మియా 49:11 అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.

గలతీయులకు 3:28 ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

సంఖ్యాకాండము 36:5 మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి యిట్లనెను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే.

ద్వితియోపదేశాకాండము 5:28 మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే.

యెహోషువ 17:4 వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటి కిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధా నుల యెదుటికిని వచ్చిమా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించె నని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను.

యోబు 42:15 ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.