Logo

సంఖ్యాకాండము అధ్యాయము 27 వచనము 11

లేవీయకాండము 25:25 నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడిపించును.

లేవీయకాండము 25:49 వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికినయెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును.

రూతు 4:3 అతడు మోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొక సంగతి తెలియజేయవలెనని యున్నాను.

రూతు 4:4 ఈ పుర నివాసుల యెదుటను నా జనుల పెద్దల యెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనినయెడల విడిపింపుము, దాని విడిపింపనొల్లనియెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించెదననెను.

రూతు 4:5 బోయజు నీవు నయోమిచేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలియొద్దనుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా

రూతు 4:6 ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.

యిర్మియా 32:8 కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని

సంఖ్యాకాండము 35:29 ఇవి మీ సమస్త నివాసస్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ.

1సమూయేలు 30:25 కావున నాటనుండి నేటివరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరచి నియమించెను.