Logo

సంఖ్యాకాండము అధ్యాయము 29 వచనము 6

సంఖ్యాకాండము 28:11 నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,

సంఖ్యాకాండము 28:12 నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవవంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయవలెను.

సంఖ్యాకాండము 28:13 అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలి.

సంఖ్యాకాండము 28:14 వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱపిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.

సంఖ్యాకాండము 28:15 నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేకపిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:3 మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱపిల్లలను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:4 వాటిలో ఒక గొఱ్ఱపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:5 దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను.

సంఖ్యాకాండము 28:6 అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయి కొండమీద నియమింపబడిన నిత్యమైన దహనబలి.

సంఖ్యాకాండము 28:7 ఆ మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.

సంఖ్యాకాండము 28:8 ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను.

నిర్గమకాండము 29:38 నీవు బలిపీఠముమీద నిత్యమును అర్పింపవలసినదేమనగా, ఏడాదివి రెండు గొఱ్ఱపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱపిల్లను

నిర్గమకాండము 29:39 సాయంకాలమందు ఒక గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.

నిర్గమకాండము 29:40 దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.

నిర్గమకాండము 29:41 అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను.

నిర్గమకాండము 29:42 ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును.

లేవీయకాండము 6:9 నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము ఇది దహనబలిని గూర్చిన విధి. దహనబలి ద్రవ్యము ఉదయమువరకు రాత్రి అంతయు బలిపీఠముమీద దహించుచుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించుచుండును.

సంఖ్యాకాండము 29:18 వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును

సంఖ్యాకాండము 29:21 విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను

సంఖ్యాకాండము 9:14 మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.

సంఖ్యాకాండము 15:11 పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను, గొఱ్ఱలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను, ఆలాగు చేయవలెను.

సంఖ్యాకాండము 15:12 మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.

సంఖ్యాకాండము 15:24 సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధిచొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను.

ఎజ్రా 3:4 మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి,ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.

సంఖ్యాకాండము 15:9 ఆ కోడెతో కూడ పడిన్నర నూనె కలుపబడిన ఆరు పళ్ల గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:10 నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతిదినమున చేయవలసిన దహనబలి.

సంఖ్యాకాండము 29:11 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

యోవేలు 1:13 యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండ నిలిచిపోయెను.

హెబ్రీయులకు 10:11 మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.