Logo

సంఖ్యాకాండము అధ్యాయము 29 వచనము 18

సంఖ్యాకాండము 29:3 నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:4 వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱపిల్లలను యెహోవాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:6 ఏడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:9 నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియవవంతులను ఒక పొట్టేలుతో రెండు పదియవవంతులను

సంఖ్యాకాండము 29:10 ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

సంఖ్యాకాండము 15:4 యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.

సంఖ్యాకాండము 15:5 ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో కూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను.

సంఖ్యాకాండము 15:6 పొట్టేలుతో కూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను.

సంఖ్యాకాండము 15:7 పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన.

సంఖ్యాకాండము 15:8 మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినయెడల

సంఖ్యాకాండము 15:9 ఆ కోడెతో కూడ పడిన్నర నూనె కలుపబడిన ఆరు పళ్ల గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను.

సంఖ్యాకాండము 15:10 మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా

సంఖ్యాకాండము 15:11 పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను, గొఱ్ఱలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను, ఆలాగు చేయవలెను.

సంఖ్యాకాండము 15:12 మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.

సంఖ్యాకాండము 28:7 ఆ మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.

సంఖ్యాకాండము 28:14 వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱపిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.

సంఖ్యాకాండము 29:21 విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను