Logo

సంఖ్యాకాండము అధ్యాయము 31 వచనము 7

ద్వితియోపదేశాకాండము 20:13 నీ దేవుడైన యెహోవా దాని నీచేతి కప్పగించునప్పుడు దానిలోని మగవారినందరిని కత్తివాత హతము చేయవలెను.

ద్వితియోపదేశాకాండము 20:14 అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్లసొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు.

న్యాయాధిపతులు 21:11 మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి.

1సమూయేలు 27:9 దావీదు ఆ దేశస్థులను హతముచేసి, మగవానినేమి ఆడుదానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను.

1రాజులు 11:15 దావీదు ఎదోము దేశముమీద యుద్ధము చేయుచుండగా, సైన్యాధిపతియైన యోవాబు చంపబడినవారిని పాతిపెట్టుటకు వెళ్లియున్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరిని హతము చేసెను.

1రాజులు 11:16 ఎదోములోనున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితో కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.

న్యాయాధిపతులు 6:1 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్ప గించెను.

న్యాయాధిపతులు 6:2 మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.

న్యాయాధిపతులు 6:33 మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదా నములో దిగగా

ఆదికాండము 34:25 మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులుచేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీద పడి ప్రతి పురుషుని చంపిరి.

సంఖ్యాకాండము 24:14 చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి

కీర్తనలు 83:9 మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.