Logo

సంఖ్యాకాండము అధ్యాయము 31 వచనము 13

ఆదికాండము 14:17 అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.

1సమూయేలు 15:12 ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను.

1సమూయేలు 30:21 అలసటచేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందల మందియొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా

సంఖ్యాకాండము 31:12 తరువాత వారు మోయాబు మైదానములలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్లసొమ్మును తీసికొనిరాగా

సంఖ్యాకాండము 31:22 మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును

సంఖ్యాకాండము 31:23 అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలోవేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను.

సంఖ్యాకాండము 31:24 ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను.

సంఖ్యాకాండము 5:2 ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతివానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతివానిని, పాళెములోనుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.

సంఖ్యాకాండము 19:11 ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.