Logo

1సమూయేలు అధ్యాయము 14 వచనము 10

1సమూయేలు 10:7 దెవుడు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుము.

ఆదికాండము 24:14 కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను.

న్యాయాధిపతులు 7:11 వారు చెప్పు కొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండు లోనికి దిగిపోవుటకు నీచేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధులయొద్దకు పోయిరి.

యెషయా 7:11 నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.

యెషయా 7:12 ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా

యెషయా 7:13 అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడ విసికింతురా?

యెషయా 7:14 కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

ఆదికాండము 15:8 అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా

న్యాయాధిపతులు 1:4 కనానీయులమీదికి యూదావంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను గనుక వారు బెజెకులో పదివేలమంది మనుష్యులను హతముచేసిరి.

1సమూయేలు 14:12 యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయులచేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి