Logo

1సమూయేలు అధ్యాయము 14 వచనము 13

కీర్తనలు 18:29 నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.

హెబ్రీయులకు 11:34 అగ్ని బలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.

లేవీయకాండము 26:7 మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు.

లేవీయకాండము 26:8 మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.

ద్వితియోపదేశాకాండము 28:7 నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలుదేరివచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు.

ద్వితియోపదేశాకాండము 32:30 తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనియెడల యెహోవా వారిని అప్పగింపనియెడల ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును? ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు?

యెహోషువ 23:10 మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటచొప్పున తానే మీకొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వేయిమందిని తరుమును

రోమీయులకు 8:31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?

2సమూయేలు 1:25 యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు నీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను.

1రాజులు 20:11 అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసివేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.

1రాజులు 20:20 ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొనిపోయెను.