Logo

1సమూయేలు అధ్యాయము 25 వచనము 19

ఆదికాండము 32:16 తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.

ఆదికాండము 32:20 మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.

సామెతలు 31:11 ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.

సామెతలు 31:12 ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు.

సామెతలు 31:27 ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.

1సమూయేలు 14:1 ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియు చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలివారిని హతముచేయ పోదము రమ్మనెను.

1సమూయేలు 25:36 అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారువరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.

2రాజులు 4:24 గాడిదకు గంతకట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను.