Logo

1సమూయేలు అధ్యాయము 25 వచనము 25

2సమూయేలు 13:33 కాబట్టి నా యేలినవాడవగు నీవు రాజకుమారులందరును మరణమైరని తలచి విచారపడవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెననెను.

యెషయా 42:25 కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధబలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.

మలాకీ 2:2 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాదఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి యుంటిని.

1సమూయేలు 25:17 అయితే మా యజమానునికిని అతని ఇంటివారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించియున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడనీయడు అనెను.

1సమూయేలు 25:26 నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడుచేయ నుద్దేశించువారును నాబాలువలె ఉందురు గాక.

ద్వితియోపదేశాకాండము 9:27 నీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసికొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము;

ద్వితియోపదేశాకాండము 13:13 పనికిమాలిన కొందరు మనుష్యులు నీమధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను.

న్యాయాధిపతులు 19:22 వారు సంతోషించుచుండగా ఆ ఊరివారిలో కొందరు పోకిరులు ఆ యిల్లు చుట్టుకొని తలుపుకొట్టినీ యింటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని యింటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా

1సమూయేలు 1:16 నీ సేవకురాలనైన నన్ను పనికిమాలినదానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిననెను.

1సమూయేలు 30:22 దావీదుతోకూడ వెళ్లినవారిలో దుర్మార్గులును, పనికిమాలినవారునైన కొందరు వీరు మనతోకూడ రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు సొమ్ములో మన మేమియు వీరికియ్యము; తమ భార్య పిల్లలను వారు తీసికొని పోవచ్చుననిరి.

2సమూయేలు 19:19 నా యేలినవాడా, నేను చేసిన ద్రోహము నామీద మోపకుము; నా యేలినవాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచు కొనకుము.

కీర్తనలు 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.

కీర్తనలు 85:8 దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినిబెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.

సామెతలు 13:16 వివేకులందరు తెలివిగలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.

సామెతలు 19:1 బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడువానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.

సామెతలు 30:22 అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,